బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎట్టకేలకు తమ గారాలపట్టి కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఐదేండ్ల లవ్ జర్నీ తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది వీరికి ఒక పాప కూడా జన్మనిచ్చింది. అప్పట్నుంచి ఆ పాప ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకత చూపించారు. కానీ అటు ఆలియా కానీ, ఇటు రణ్‌బీర్ కపూర్ కానీ తమ కూతురు ఫొటోను బయటపెట్టలేదు. పాపకు రెండేండ్లు వచ్చేదాకా ఫొటోలు బయటపెట్టే ఉద్దేశ్యం లేదని ఆలియా సన్నిహితులు ఇదివరకు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు తమ కూతుర్ని రణ్‌బీర్-ఆలియా దంపతు లు కెమెరా ముందుకు తీసుకొచ్చారు. క్రిస్మస్ సందర్భంగా తమ గారాలపట్టి రాహా కపూర్‌తో ముంబైలో ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ జంట సందడి చేశారు. తమ కూతురు రాహాను మీడియా వాళ్లకు చూపించారు. ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.