నాని కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. రా స్టేట్‌మెంట్ పేరుతో కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచింది. ఇది కడుపుమండిన కాకుల కథ. వాటిని ఒక్కటి చేసిన తిరుగుబాటుదారుడి కథ. యువకుడు నాయకుడిగా మారి జాతిని ఒక్కటి చేసిన కథ’ అంటూ గ్లింప్స్‌లో సినిమా సారాంశాన్ని చెప్పారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని తుపాకీ పట్టుకొని యుద్ధానికి సిద్ధమన్నట్లు పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. హైదరాబాద్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, నాని పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ సంగీతాన్నందిస్తున్నారు.
