అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైయేశ్ వీర (24) మృతి చెందాడు. అమెరికాలో సైయేశ్ మాస్టర్స్ డిగ్రీ చేస్తూ పెట్రోల్ బంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నట్టు కొలంబస్ పోలీసులు తెలిపారు. సైయేశ్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుడిని దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్న తరుణంలో మృతి చెందాడని వారు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. సైయేశ్ కొన్ని రోజుల్లో ఉద్యోగం మానేయాలనుకున్న తరుణంలో ఈ దారుణం జరిగిందని మృతుడి బంధువు రోహిత్ ఆవేదన చెందారు. సైయేశ్ ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడని, మంచి క్రికెటరని తెలిపాడు.


