కెనడాలో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల యువరాజ్ గోయల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యా డు. ఈనెల 7న సుర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా, అప్పటికే యువరాజ్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుర్రే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు మన్వీబాస్రామ్ (23), సాహిబ్ బాస్రా (20), హర్కిరత్ ఝుట్టీ (23), ఓంటారియోకు చెందిన కీలాన్ ఫ్రాంకాయిస్ (20)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.
యువరాజ్ గోయల్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా. 2019లో స్టూడెంట్ వీసాపై కెనడా వెళ్లాడు. అతడు బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సుర్రే ప్రాంతంలో కార్ డీలర్‌షిప్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. ఇటీవలే అతడికి కెనడియన్ శాశ్వత నివాసార్హత అనుమతి వచ్చింది. యువరాజ్ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.