Namaste NRI

ఆది సాయికుమార్ సీఎస్ఐ సనాతన్ నయా అప్‌డేట్

ఆది సాయికుమార్, మిషా నారంగ్ జోడీగా నటిస్తున్న చిత్రం సిఎస్ఐ సనాతన్. శివశంకర్ దేవ్ దర్శకుడు. అజయ్ శ్రీనివాస్ నిర్మాత.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ తో గ్రిప్పింగ్ సన్నివేశాలు ఉండనున్నాయి.  తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సీఎస్ఐ సనాతన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నాను. అందరికి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పూర్తి సంతృప్తిచెందుతారు. తప్పకుండా ఈ చిత్రం దర్శకుడిగా మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకం వుంది అన్నారు.

కథానాయకుడు ఆది మాట్లాడుతూ  కథ వినగానే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఓ క్రైమ్ సీన్‌పై  ఖచ్చితంగా ఓ పాయింట్ చుట్టూ తిరిగే కథ తెలుగులో సిఎస్ఐ సనాతన్ మొదటిది అనుకుంటున్నాను. సినిమా అందరికి ఓ మంచి అనుభూతినిస్తుంది అన్నారు. ఈ మూవీలో తారక్ పొన్నప్ప, వాసంతి, సంజయ్ రెడ్డి, మధుసూదన్ రావు, అలీ రెజా, ఖయ్యుమ్, శివకార్తీక్, ఇతర నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events