ప్రశాంత్ కార్తీ, రితిక చక్రవర్తి జంటగా తెరకెక్కుతున్న చిత్రం అనంత. మధుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ప్రశాంత్ నిర్మాత. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్నమైన అంశాన్ని స్పృశిస్తూ రూపొందిన చిత్రమిది. థ్రిల్లర్, మైథలాజికల్, సైకలాజికల్ అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాం. అంతర్జాతీయ అంశంతో రూపొందించిన ఈ సినిమా వినోదం తోపాటు, కొత్త విషయాల్ని తెలుసుకునేలా చేస్తుందన్నారు. మధుగారు ఈ స్టోరీ చెప్పగానే వర్కవుట్ అవుతుందా? అనుకున్నాను. కానీ సినిమా బాగా వచ్చింది అన్నారు ప్రశాంత్ కార్తీ. ఈ చిత్రానికి సంగీతం : ఘంటసాల విశ్వనాథ్, కెమెరా: సిద్ధు సోమిశెట్టి.