మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆస్మాన్. రామ్నందన్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. హీరో మేఘాంశ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. మీరు ఇప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే. మీరందరూ కూడా కనిపించని చీకట్లో ఉన్నారు. అదే నిజం అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సామాజిక అంశాల్ని స్పృశిస్తూ సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. రాయంచ, రవివర్మ, కమల్, కేశవ్దీపక్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షోయబ్, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, దర్శకత్వం: రామ్నందన్.















