జిసాన్, అయుక్త జంటగా శేఖర్ పెనుమర్తి తెరకెక్కిస్తున్న చిత్రం అభిమన్యు. ఆర్.కె.నీతి పూడి నిర్మాత. బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఒక సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని చేస్తున్న చిత్రమిది. కథ బాగా వచ్చింది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరిస్తున్నాం అన్నారు. మంచి కథతో అన్ని రకాల వాణిజ్య హంగులతో సినిమా నిర్మిస్తున్నాం. నేటి యువత కచ్చితంగా చూడాల్సిన సినిమా అన్నారు నిర్మాత. సంగీతం : రవి కుమార్, ఛాయాగ్రహణం: ప్రసాద్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)