హాస్య నటుడు అభినవ్ గోమఠం హీరోగా మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. వైశాలి రాజ్ కథానాయిక. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం. తరుణ్‌భాస్కర్, అలీ రేజా, మెయిన్, చక్రపాణి ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవల ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో యువ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నటు డిగా అభినవ్ గోమఠంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. లవ్, కామెడీ అంశాలతో ఆకట్టు కుంటుంది. కొత్తదనంతో కూడుకున్న కథతో అందరిని మెప్పిస్తుంది. ఫిబ్రవరి ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ స్వయంభూ, సంగీతం: సంజీవ్ టి, సంభాష ణలు: రాధామోహన్, నిర్మాతలు: భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్ వి, దర్శకత్వం: తిరుపతి రావు ఇండ్ల.