
సందేశాత్మక ఇతివృత్తంగా దర్శక-నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన బాలల చిత్రం అభినవ్. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర ఇందులో కీలక పాత్రధారులు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. విద్యార్థులనూ ఈ పిశాచి వదలడంలేదు. అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు? అనే సందేశాత్మక కథాంశంతో ఈసినిమా రూపొందింది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఈ సినిమా నిర్మించాం. ఇంకా ఇందులో మరెన్నో సామాజిక అంశాలను స్పృశించాం అని దర్శకనిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, సంగీతం: వందేమాతం శ్రీనివాస్, నిర్మాణం: శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్.
