Namaste NRI

తెలుగు అకాడమీ పేరు మార్పు….

తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌లో నలుగురికి నియామకం కూడా చేపట్టింది. తెలుగు అకాడమీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి.భాస్కర్‌ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకులు డాక్టర్‌ నేల రాజ్‌కుమార్‌, గుంటూరు జెకెసి కాలేజ్‌ తెలుగు రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం.విజయశ్రీ, ఎస్‌ఎంఎస్‌ బిఇడీ కళాశాలకు చెందిన లెక్చరర్‌ కప్పగంతు రామకృష్ణను అకాడమీ బోర్డుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ మురళీధర్‌ శర్మను అకాడమీలో పాలకవర్గ సభ్యులుగా యూజిసి నామినీగా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ సతీస్‌ చంద్ర జీవోలు జారీ చేశారు.

                 మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అప్పట్లో తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. పీవీ ఏర్పాటు చేసిన ఆ అకాడమీకి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గుర్తింపు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు తెలుగు అకాడమీని కొనసాగించాయి. అయితే ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అకాడమీ పేరు మార్చడం వివాదాస్పదంగా మారింది. తెలుగు అకాడమీ పేరు మార్చడమంటే తెలుగు భాషకు తెగులు పట్టించడమేనంటూ భాషాభిమానులు మండిపడుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events