Namaste NRI

ఫ్లోరిడాలో ప్రమాదం.. 39 మంది గల్లంతు

అమెరికా లోని ఫ్లోరిడా తీరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది మనుషులను తీసుకుని వెళ్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ప్రమాదంలో 39 మంది గల్లంతయ్యారు. వారి ఆ చూకీ కోసం తీరప్రాంత అధికారులు వెతుకులాట ప్రారంభించారు. మానవ స్మగ్లింగ్‌కు ఉపయోగించినట్లు భావిస్తున్న ఈ పడవ కరేబియన్‌ దేశమైన బహమాస్‌ నుంచి బయలుదేరినట్లు అధికారులు చెబుతున్నారు. పోర్టుపియర్స్‌కు తూర్పున 72 కిలోమీటర్ల దూరంలో పడవను పట్టుకొని వేలాడుతున్న  ఓ వ్యక్తి వేలాడుతున్నాడు. అతడిని ఓ సమారిటన్‌ గుర్తించి అతడిని రక్షించడానికి, అనంతరం  పడవ మునిగిపోయిన విషయం కోస్టుగార్డ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడని సముద్ర భద్రతా ఏజెన్సీ తెలిపింది.

                        మియామీకి తూర్పున 50 మైళ్ల (80 కి.మీ) దూరంలో ఉన్న బహామాస్‌ బిమిని దీవుల నుండి 39 మంది వ్యక్తులతో  శనివారం రాత్రి పడవలో బయలుదేరినట్లు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి అధికారులకు తెలిపినట్లు కోస్ట్‌ గార్డ్‌  అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఫ్లోరిడాలోని అట్లాంటిక్‌ తీరంలో ఫోర్ట్‌ పియర్స్‌ ఇన్‌లెట్‌కు మయామి మరియు కేప్‌ కెనావెరల్‌ మధ్యలో జరిగినట్లు.. ఇక్కడకు పడవ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిందని,  అలలతాకిడికి ఓడ బోల్తా పడిరదని చెప్పారు. అంతేకాదు ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే కానీ ఓడలో ప్రయాణంలో చేస్తున్న సమయంలో కూడా ప్రయాణీకులు ఎవరు లైఫ్‌ జాకెట్‌ ధరించాలేదని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events