Skip to main content

Namaste NRI

మాస్‌కి నచ్చే యాక్షన్‌, యూత్‌కి కావాల్సిన రొమాన్స్‌.. అన్నీ ఈ సినిమాలో

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న రూరల్‌ యాక్షన్‌ డ్రామా అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కండ్రేగుల నాయుడుతో కలిసి ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్‌ చేశారు. అనకాపల్లి ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే, ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుచ్చ పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి.. మనకి కావాల్సింది దక్కించుకోవాలి.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో అన్ని రకాల ఎమోషన్సూ ఉన్నాయి.

మాస్‌కి నచ్చే యాక్షన్‌, యూత్‌కి కావాల్సిన రొమాన్స్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కావాల్సిన ఎమోషన్స్‌ అన్నీ ఈసినిమాలో ఉంటాయని టీజర్‌ చెబుతున్నది. రా అండ్‌ రస్టిక్‌గా రూపొందిన అనకాపల్లి చిత్ర కథేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అగ్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు ఇందులో కీలక పాత్ర కూడా పోషించడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, సంగీతం: దేవ్‌జండ్‌, నిర్మాణం: భవ్యశ్రీ మూవీమేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events