
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్‌లలో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్‌ల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. ఆమిర్ ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రపతిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గోన్నారు.
