సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం నటరత్నాలు. ఇనయ సుల్తానా కథానాయిక. నర్రా శివనాగు దర్శకుడు. డా॥ దివ్య నిర్మాత. పాటలు మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. నేరం నేపథ్యంలో సాగే ఈ సినిమా టాకీ భాగం చిత్రీకరణ పూర్తయినట్టు సినీవర్గాలు తెలిపాయి. దర్శకుడు మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ, క్రైమ్ నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. త్వరలోనే పాటలను పూర్తి చేసి అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి లైవ్ ప్రొడ్యూసర్: నాగమధు. ఛాయాగ్రహణం: గిరికుమార్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)