
నటి హేమ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఒకప్పుడు హేమ అంటే ఆమె నటించిన క్యారెక్టర్స్ గుర్తుకు వస్తాయి. హేమ అతడు సినిమాలో బ్రహ్మానందంతో కలిసి చేసిన కొన్ని సీన్స్‌కి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా కూడా, అతడు సినిమా గురించే అడుగుతుంటారు. అయితే అలాంటి పాత్రలు ఎప్పుడుచేస్తారు హేమా గారూ అని అడగగా, అలాంటి పాత్రలు కాదు, అసలు ఇకపై ఎలాంటి పాత్రలు చేయనంటూ పెద్ద షాక్ ఇచ్చింది నటి హేమ.

నేను 14 ఏళ్ళ వయసు నుంచి కష్టపడుతున్నా. ఇకపై విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది . జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా, కొంచెం చిల్ అవ్వాలి కదా అందుకే చిల్ అవుతున్నా. సినిమాలకు, నటనకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. బాహుబలిలో శివగామి లాంటి పాత్ర ఇచ్చినా చేయను అని హేమ తేల్చి చెప్పింది. ఒకవేళ మళ్ళీ నాకు నటనపై ఆసక్తి కలిగితే అప్పుడు ఆలోచిస్తానంటూ హేమ స్పష్టం చేసింది. ఇప్పుడు హేమ ఎంజాయ్ చేయాలనే మూడ్‌లో ఉంది. ఆ కారణంగానే సినిమాలకి దూరం అవ్వాలని డిసైడ్ అయింది.అయితే హేమ ఎంజాయ్‌మెంట్ కోసమే సినిమాలు మానేస్తుందా, లేకుంటే వేరే కారణం ఏదైన ఉందా అనే దాని గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.
