ఆదాశర్మ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం సీ.డీ. (క్రిమినల్ అండ్ డెవిల్). కృష్ణ అన్నం దర్శకుడు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఆదాశర్మ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. భారీ ఎత్తున విడుదకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, కథ, సంభాషణలు: ఏ.ముద్దుకృష్ణ, దర్శకత్వం: కృష్ణ అన్నం.