ఆసియాలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. 15 ఏళ్లుగా ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా రియలన్స్ అధినేత ముకేష్ అంబానీ ఉంటూ వచ్చారు. మళ్లీ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ విడుదల చేసిన ఇండెక్స్‌లో స్థానాలు తారుమారయ్యాయి. మళ్లీ ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నిలిచారు. గౌతమ్ అదానీ కేవలం ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో ఉన్నారు. 24 గంటలు గడిచేసరికి అంబానీ మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరి సంపదలో తేడా రావడంతో ముకేష్ పైకి ఎగబాకగా, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ఏషియా నవంబర్ 2, ప్రపంచంలో 11వ స్థానానికి పరిమితం య్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)