ఆది సాయికుమార్, రియాన్ సుమన్ జంటగా కె.శశికాంత్ దర్శకత్వంలో కేవీ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం టాప్‌గేర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో మా సినిమా ఆడియన్స్ అలరిస్తుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కీ, ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది. బ్రహ్మాజీ, సత్యం, రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, మిర్చి హేంత్ తదితరులు నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సినీ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.