ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ ఫ్రమ్ బృందావనం ప్రారంభమైంది. దిగంగనా సూర్యవంశీ కథనాయిక. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ పతాకంపై తూము నరసింహా, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విఛాన్ చేశారు.
చుట్టాలబ్బాయ్ తర్వాత ఆది సాయికుమార్‌తో చేస్తున్న చిత్రమిదని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తా మని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘు బాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీ దేవి, అలేక్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురు రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, సంభాషణలు: రాము మన్నార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి.