Skip to main content

Namaste NRI

నవంబర్‌ లో ఆదికేశవ

వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. ఇటీవలే పారిస్‌లో కొంతభాగం షూటింగ్‌ పూర్తి చేశాం. వైష్ణవ్‌తేజ్‌ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తొలి గీతాన్ని త్వరలో విడుదల చేయబోతున్నా  అని పేర్కొన్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాతో మాస్ మూవీ ప్రియులను, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలని ఈ నూతన దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పంజా వైష్ణవ్ తేజ్‌ను మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో చూపించి మెప్పించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 10న విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News