ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ, ప్రమోద్‌లతో కలిసి టి- సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్ నిర్మించారు. ప్రభాస్ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నది. సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్రలో, హనుమంతుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించు కొని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మంత్రం కంటే గొప్పది నీ నామం అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ పోస్టర్‌లో రాఘవ్‌గా ప్రభాస్, జానకిగా కృతి సనన్, శేష్‌గా సన్నీ సింగ్, భజరంగ్‌గా దేవదత్తా నాగే వారికి వంగి వంగి వంగి నమస్కరిస్తున్నట్లు ఉంది. శ్రీరామనవమి రోజున మాతా వైష్ణోదేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిత్రబృందం అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16న 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.