Namaste NRI

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం నుంచి వెన్నెలగా అదితి శంకర్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌  భైరవం  చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, నారా రోహిత్‌, మనోజ్‌ మంచు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకుడు. కేకే రాధామోహన్‌ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సరసన అదితి శంకర్‌ నటిస్తున్నది. ఆమె ఫస్ట్‌లుక్‌ ను విడుదల చేశారు. ఇందులో ఆమె అల్లరి అమ్మాయి వెన్నెల పాత్రలో కనిపిస్తుందని, అందం, అమాయక త్వం కలబోసిన పల్లెటూరి యువతిగా మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో అదితి శంకర్‌ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ కనకమేడల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events