అఫ్గాన్ పౌరులు ఇకపై కేవలం ఈ`వీసాల ద్వారానే భారత్‌కు రావాలని కేంద్రహోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్ వెలుపల ఉన్న అఫ్గాన్ దేశస్థులకు ఇదివరకే జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేస్తున్నట్టు వెల్లడిరచింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వచ్చి అఫ్గానీయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షోభ పరిస్థితుల కారణంగా అక్కడి ఎంబసీలను మూసేశారు. దాంతో ఆన్‌లైన్‌లో ఈ`వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ`వీసా ఆరు నెలలు చెల్లుబాటు అవుతుంది. సాధారణ వీసాలు పొంది భారత్‌కు చేరుకొని వీసాలు ఇకపై చెల్లుబాటు కావని, ఈ వీసాలపైనే భారత్‌లోకి అనుమతిస్తామని హోం శాఖ స్పష్టం చేసింది.