Namaste NRI

విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి నుంచి ఆరాధ్య పాట

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివనిర్వాణ దర్శకుడు. నవీన్‌ యేర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మాతలు. ఈ  చిత్రంలో జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్‌. నాతో రా, నీలా రా, ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ రచించగా, తమిళంలో మదన్‌ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిద్‌శ్రీరామ్‌, చిన్మయ ఆలపించారు.  దర్శకుడు మాట్లాడుతూ విజయ్‌, సమంత కలయికలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. కుటుంబ భావోద్వేగాలకు, వినోదాన్ని మేళవించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే విధంగా వుంటుంది అన్నారు. సెప్టెంబర్‌ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events