18ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన స్టాలిన్ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వీరిద్దరి కలయికకు విశ్వంభర వేదికైంది. వశిష్ఠ దర్శకత్వం. ఈ చిత్రంలో త్రిషను రంగంలోకి దింపేశారు దర్శకుడు వశిష్ఠ. యూవీ క్రియేషన్స్‌తోపాటు చిరంజీవి కుమార్తె సుస్మిత సొంత నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. చిరంజీవి కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. అడ్వంచరస్ సోషియోఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీటికి తోడు త్రిష కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)