భారత రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం జాతీయ వార్ మెమోరియల్‌ను సందర్శించడంతో వేడుక లు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియో గించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)