Namaste NRI

మోదీ అమెరికా పర్యటన తర్వాత… అమెరికా కీలక తీర్మానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక అమెరికా పర్యటన తర్వాత మన దేశానికి అనుకూలంగా అమెరికా కాంగ్రెస్ సెనేటోరియల్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.  అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో భారత్‌కు అమెరికా అండగా నిలిచింది. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని సెనేటర్లు జెఫ్ మెర్క్లీ, బిల్ హాగెర్టీ, టిమ్ కైన్, క్రిస్ వాన్ హోలెన్ ప్రవేశపెట్టారు.  ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన భాగస్వాములతో సహకారాన్ని పెంపొందించుకొనేందుకు కట్టుబడి ఉన్నట్టు తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానం ఆమోదం పొందితే అరుణాచల్‌ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు అమెరికా సాయం చేసే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events