భారతదేశంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ తర్వాత కేసీఆరే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న 17వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించడంతో పాటు రచయిత్ర ప్రభావతి రాసిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికాలోని ప్రవాసులు భారతదేశం గర్వించేలా సేవలందిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస తెలుగు ప్రజలు భాగస్వాములు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులు గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల వారు అగ్రస్థానంలో ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమెరికాలో ఉన్న తెలుగువారికి తెలియజేసేందుకు ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేయడం ఆదనందదాయకం. ఆటా అంటే ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్‌గా అభివర్ణించారు. అమెరికాలో తెలుగు సంఘాలైన ఆటా, తానాలు ఏదైనా నగరంలో ప్రధాన కేంద్రం ఏర్పాటు చేసి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం స్థాపిప్తే అంది ముందు తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మాల్దీవులు, మారిషస్‌లో ఉన్న తెలుగువారు అక్కడ మాతృ భాషను, సంస్కృతిని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు. అలాంటి కృషి అమెరికాలోనూ జరగాలి. ఆటాకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని తెలిపారు.