Namaste NRI

ఈ సినిమా చూశాక .. ఐ లవ్‌ యూ డాడీ అనాల్సిందే

సుమంత్‌ ప్రభాస్‌ కథానాయకుడు నటించిన చిత్రం గోదారి గట్టుపైన. సుభాష్‌చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ హృదయాల్ని స్పృశించే అందమైన భావోద్వేగాలతో గోదారి గట్టుపైన చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ వేసవిలో అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.

మానవ విలువలు ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ సినిమా చూశాక తండ్రీకూతుళ్ల అనుబంధం తాలూకు గాఢత అర్థమవుతుందని, ప్రతీ అమ్మాయి వాళ్ల నాన్నకు ఫోన్‌చేసి ఐ లవ్‌ యూ డాడీ అని చెబుతుందని సుమంత్‌ ప్రభాస్‌ అన్నారు. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రి కథ ఇదని దర్శకుడు సుభాష్‌చంద్ర తెలిపారు. థియేటర్‌లో చూసి ఫీల్‌ కావాల్సిన సినిమా ఇదని నిర్మాత అభినవ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events