Skip to main content

Namaste NRI

అగధ హర్రర్‌ మూవీలా మాత్రమే ఉండదు : శ్యాం ప్రసాద్ రెడ్డి

కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మైథలాజికల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ అగధ. దర్శకుడు ఎం.ఎస్‌.రాజు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి, బి.గోపాల్‌, సాయిరాజేష్‌, ఎస్‌కేఎన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎం.ఎస్. రాజు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు ఆయనే ట్రెండ్ సెటర్‌గా మారారు. అన్ని రకాల చిత్రాల్ని ఆయన నిర్మించారు. రాజు మీదున్న నమ్మకంతో చెబుతున్నా, ఇది కేవలం హారర్ మూవీలా మాత్రమే ఉండదు. అరుంధతి టైంలో అనుష్కని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు కామాక్షిని చూస్తే కలుగుతోంది. సినిమాకి మంచి విజయం ఖాయం అని అన్నారు.

ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ అగధ చిత్రం అమ్మవారి ఆశీర్వాదంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు. లాస్ట్‌ ఓవర్‌లో 24రన్స్‌ కొట్టాలంటే మ్యాచ్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ నేను సూపర్‌ఓవర్‌లా ఈ సినిమా తీశాను. అద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, విజయంపై టీమంతా ధీమాగా ఉన్నామని నిర్మాత కాశీ విశాలాక్షి చెప్పారు. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఫీమేల్‌ లీడ్‌గా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని కథానాయిక కామాక్షి భాస్కర్ల పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events