Skip to main content

Namaste NRI

వలసలకు వ్యతిరేకంగా … యూకేలో

యూకేలో వలస వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్‌లో సూడాన్‌కు చెందిన 30 ఏండ్ల వ్యక్తి కత్తితో ఒక పౌరుడి తల నరకడానికి యత్నించడం యూకే వాసులను షాక్‌కు గురి చేసింది. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో యూకే వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉత్తర ఐర్లాండ్‌ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో ముసుగులు ధరించిన నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఇండ్లు, వాహనాలు, బస్సులకు నిప్పంటించారు. పలు చోట్ల పోలీసులపై కూడా దాడులు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి సూడాన్‌కు చెందిన వలసవాది అని, 2028 వరకు అతనికి రెసిడెన్సీ పర్మిట్‌ ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News