స్థానికంగా పర్యటకాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు వీసా లేకుండానే విదేశీయులను పలు దేశాలు అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో వీసారహిత పర్యటనలను అనుమతించే విషయాన్ని చర్చించేందుకు భారత్, రష్యాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాల సాధ్యాసాధ్యాలపై జూన్‌లో తొలివిడత చర్చలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరికి ఇరుదేశాల మధ్య ఒప్పందాలు ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
వీసారహిత పర్యటన అనుమతుల్లో అంతర్గత సమన్వయం కోసం భారత బృందంతో సంప్రదింపులు జరుపుతున్నాం. అవి తుది దశలో ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంపై త్వరలోనే చర్చిస్తాం. జూన్‌లోనే తొలిదశ చర్చలు నిర్వహిస్తాం. ఏడాది చివరికి ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది అని రష్యా ఆర్థికాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన నికితా కొంద్రాత్యేవ్ పేర్కొన్నారు.