హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమయింది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సిడబ్ల్యూసి సభ్యులు జాతీయ జెండాకు వందనం చేశారు. హైదరాబాద్‌లో హోటల్ తాజ్ కృష్ణ హాటల్‌లో జరుగుతోన్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతోన్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, ఈ సమావేశానికి సిడబ్ల్యూసి సభ్యులతో పాటు నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సిఎంలతో పాటు పార్టీ కీలక నేతలు కెసి వేణుగోపాల్, సుర్జేవాలా, జైరాం రమేష్ తదితర నేతలు హాజరయ్యారు.
