రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వారిని వేగంగా భారత్కు తరలిస్తున్నది. రాబోయే రోజుల్లో 31 విమానాల్లో తూర్పు యూరోపియన్ దేశంలో చిక్కుకుపోయిన 6300 మంది భారతీయులను తరలించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అత్యధిక సామర్థ్యం కలిగిన రవాణ విమానం సీ`17ను రంగంలోకి దింపింది. 200 మంది భారతీయులతో కూడిన తొలి సీ`17 విమానం ఉక్రెయిన్ నుంచి తాజాగా బయలుదేరింది. ఈ రోజు భారత్కు చేరుకుంటుందని సమాచారం. తెల్లవారుజామున పోలాండ్, హంగరీ దేశాల నుంచి మరో రెండు విమానాలు భారతీయ విద్యార్థులలో స్వదేశానికి చేరుకుంటాయని ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు భారత వాయుసేన మొత్తం నాలుగు విమానాలను పంపించింది. వాయుసేన సహాయం కూడా తీసుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే మరింత మంది భారతీయులను స్వదేశానికి చేర్చవచ్చు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిర్ఫోర్స్ సీ`17 రవాణా విమానాలను రంగంలోకి దింపింది. అమెరికా రూపొందించిన సీ`17 గ్లోబ్మాస్టర్, ఐఎల్`76 రవాణా విమానాలకు సుదీర్ఘ దూరం సునాయసంగా ప్రయాణించే సామర్థ్యం ఉంది. వీటిలో ఒకేసారి దాదాపు 700 మందిని తరలించవచ్చు.