Namaste NRI

ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌.. యూఏఈ నుంచి భారత్ వెళ్లే వారికోసం

యూఏఈలోని భారత ప్రవాసులకు ఎయిర్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవాసులు అతి తక్కువ ధరకే స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించింది. యూఏఈ నుంచి భారత్‌లోని ఢల్లీి, ముంబై, చెన్నై వంటి గమ్యస్థానాలకు వన్‌వే టికెట్‌ ధర కేవలం 330 దిర్హమ్స్‌గా  (రూ.7,147) నిర్ణయించింది. వన్‌ ఇండియా వన్‌ ఫేర్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియా ఎయిర్‌లైన్‌ అన్ని గల్ఫ్‌ స్టేషన్‌ల నుండి (ఒమన్‌ మినహా) భారతదేశంలోని ఏ గమ్యస్థానానికి అయినా అన్ని డైరెక్ట్‌ విమానాలలో ఆకర్షణీయమైన వన్‌ వే ఛార్జీలను అందిస్తుంది. ఇక ఈ ప్రమోషన్‌ పీరియడ్‌లో భాగంగా అక్టోబరు  15, 2022 వరకు విక్రయించే అన్ని టిక్కెట్‌లపై ప్రయాణికులకు చెన్‌ ఇన్‌ బ్యాగేజీ అలవెన్స్‌గా 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్‌ లగేజీని తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events