ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. వందేభారత్ సర్వీసుల కింద ఆస్ట్రేలియాలోని సిడ్నీ- ఢిల్లీ మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడుపుతామని తెలిపింది. ఇందుకు పూర్తి విమాన సర్వీసుల షెడ్యూల్ ప్రకటించింది. నేటి నుండి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని పేర్కొన్నది. ఎయిర్ ఇండియా వెబ్సైట్, బుకింగ్ ఆఫీసులు, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజేంట్లు బుకింగ్ ఆఫీసుల్లో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు ఆస్ట్రేలియన్ విమానయాన సంస్థ క్వాంటాస్ కూడా సిడ్నీ-ఢిల్లీ మధ్య వచ్చేనెల ఆరో తేదీ నుంచి విమాన సర్వీసులు నడుపుతామని పేర్కొన్నది.