ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న చిత్రం శాసనసభ. వెంకటాపురం ఫేమ్ వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యారాజ్ తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముణం సాప్పని నిర్మిస్తున్నారు. డా॥ రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, హెబ్బాపటేల్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. నాయిక ఐశ్వర్యరాజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో భావన పాత్రలో ఐశ్వర్యరాజ్ నటన ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ కథతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)