Namaste NRI

మ‌ట్కా నుంచి అజయ్ ఘోష్‌ లుక్ రిలీజ్

టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్‌  కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం మట్కా. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు.  పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం.  అజయ్‌ ఘోష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చిల్లప్ప రెడ్డిగా కనిపించబోతు న్నాడు.  గోల్డెన్ హార్ట్ అండ్‌ అచంచలమైన చిత్తశుద్ధితో కూడిన విధేయతతో కూడిన ఆత్మ.. అంటూ షేర్ చేసిన ఈ లుక్‌ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అజయ్ ఘోష్‌ లుక్ షేర్ చేశారు మేకర్స్‌. ఇప్పుడీ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మట్కా చిత్రాన్ని నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

మట్కాలో కథానుగుణంగా వైజాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండే పూర్ణా మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాలను రీక్రియేట్ చేశారని తెలిసిందే. వరుణ్‌ తేజ్‌, నోరా ఫతేహి అండ్ టీంపై వచ్చే లే లే రాజా పాటను చిత్రీకరించినట్టు చెప్పారు మేకర్స్‌. ఈ సాంగ్ కలర్‌ఫుల్‌గా సాగుతూ సినిమాకు హైలెట్‌గా నిలువబోతుందని యాక్ట్ 2 హింట్ ఇచ్చేస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events