తమిళ అగ్ర నటుడు అజిత్ నటిస్తున్న తాజా చిత్రం విదాముయార్చి. తెలుగులో పట్టుదల పేరుతో విడుదలకానుంది. మగిళ్ తిరుమేని దర్శకత్వం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో తనవాళ్ల కోసం అజిత్ చేసిన పోరాటాలు, కథానాయిక త్రిషతో ఆయన రొమాన్స్, అజర్ బైజాన్‌లో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలిచాయి. యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర సైతం ఆసక్తినిరేకెత్తించింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని ట్రైలర్ చూస్తే అర్థమవుతున్నది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నా రు. ఈ చిత్రానికి కెమెరా: ఓంప్రకాష్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్.