Skip to main content

Namaste NRI

లెనిన్‌ తో అఖిల్‌కు సరైన విజయం దక్కింది: నాగార్జున

అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం లెనిన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ అక్కినేని ఫ్యాన్స్ దేవుళ్లు. అఖిల్‌కు ఒక బ్లాక్‌బస్టర్ రావాలని ఇన్నేళ్లు ఎంతో ఓపికగా ఎదురు చూశారు. నాగచైతన్యకు తండేల్ లాంటి విజయం రావాలని ఎలా ఎదురుచూశారో, అదే ప్రేమతో అఖిల్ కోసం కూడా నిలబడ్డారు. మీ అందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు.

ఏజెంట్ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకున్న అఖిల్, ఈసారి కథ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు చెప్పిన లెనిన్ కథను ఎంచుకున్నారు. సినిమా కోసం తన లుక్, బాడీ లాంగ్వేజ్, నటనలో కూడా మార్పులు తీసుకువచ్చారు. ఆ కృషికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక అక్కినేని అభిమానులు కూడా మొదటి రోజు నుంచే సినిమాకు బలమైన మద్దతు అందించారు. అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల వద్ద కనిపించిన సందడి, సోషల్ మీడియాలో వస్తున్న స్పందన చూస్తుంటే అఖిల్‌కు చాలా కాలం తర్వాత ఒక మంచి కమర్షియల్ సక్సెస్ దక్కినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎమోషన్స్‌తో పాటు ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని రివ్యూలు చెబుతున్నాయి.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events