Namaste NRI

మంచి సందేశాన్నిచ్చే చిత్రం ఆక్రోశం : అరుణ్‌ విజయ్‌

అరుణ్‌ విజయ్‌ హీరోగా. పల్లక్‌ లల్వానీ జంటగా నటించిన చిత్రం ఆశ్రోశం.  ఈ చిత్రానికి సతీష్‌ కుమార్‌ అసోసియేషన్‌తో జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్‌, మూవీ స్లయిడర్స్‌, ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. జి.యస్‌. కుమార వేలన్‌ దర్శకుడు.  ఆర్‌ విజయ్‌ కుమార్‌ నిర్మాత. ఈ నెల 16న సినిమా విడుదలవుతున్నది. ఈ  సందర్భంగా నిర్మాత సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. రివెంజ్‌ డ్రామా కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సమాజానికి చెప్పాల్సిన కొన్ని మంచి పాయింట్స్‌ ఈ కథలో ఉన్నాయి అన్నారు. హీరో అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ మంచి సందేశంతో పాటు ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు.  ఈ  సమావేశంలో నిర్మాత సతీష్‌ కుమార్‌, హీరోయిన్‌  పల్లక్‌ లల్వాని తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress