Namaste NRI

విజువల్స్ తో ఆకట్టుకుంటోన్న ఆకాశం టీజర్

అశోక్‌ సెల్వన్‌ హీరోగా ఆర్‌.ఎ.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ఆకాశం. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన హీరో అశోక్‌ సెల్వన్‌ లుక్‌ పోస్టర్స్‌, ముగ్గురు హీరోయిన్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి.  కాగా  ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు టీజర్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. హేయ్‌ అర్జున్‌ మనసింత ఉల్లాసంగా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా ఆందంగా గుర్తొస్తాయి కదూ అంటూ రీతూ చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఇందులో అశోక్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముగ్గురు నాయికలతో అతనికి ఉన్న అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ మూడు ప్రేమ కథల్లోనూ బలమైన భావోద్వేగాలు నిండి ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తుంది. మరి ఈ కథలన్నీ సుఖాంతమయ్యాయా? లేదా? తెలియాలంటే ఇంకొన్నాల్లు వేచి చూడక తప్పదు. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. వయాకామ్‌ 18. రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి.  ఈ సినిమాకి సంగీతం : గోపీ సుందర్‌,  ఛాయాగ్రహణం: లీలావతి కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events