కృష్ణవంశీ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం అలనాటి రామచంద్రుడు. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనివా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని తదితరులు నటిస్తు న్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సున్నితమైన భావోద్వేగాలతో సాగే ప్రేమకథా చిత్రమిది. మండు వేసవిలో చిరుజల్లులా మనసుకు హాయిని పంచుతుంది. కుటుంబ అనుబంధాల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ అనే యువకుడిని హీరోగా పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి, రచన-దర్శకత్వం: చిలుకూరి ఆకాష్ రెడ్డి.
