ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. మరోసారి తెలుగు సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపింది ప్రముఖ బాలీవుడ్ కథానాయిక అలియాభట్. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ముంబయిలో వెల్లడిరచారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా అలియాభట్‌ని ఎంపిక చేశారు. కొరటాల శివ వచ్చి కథ చెప్పారు. నేను మరో మాట లేకుండా అంగీకారం తెలిపాను. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నా అన్నారు అలియాభట్. ఎన్టీఆర్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ని యువసుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెలలోనే పూజా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వారంలో ఎన్టీఆర్, కొరటాల సినిమా ఆరంభమవుతుందని తెలిసింది.














