ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య యుద్ధం ముగిసింది. క్షిపణులు, రాకెట్ల దాడులతో దద్దరిల్లిన దక్షిణ లెబనాన్‌లో శాంతి నెలకొన్నది. 14 నెలల పాటు కొనసాగిన పోరాటానికి ఇరుపక్షాలు స్వస్తి పలికాయి. అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కాస్త ఉపశమనం లభించింది. మొదట 60 రోజుల కోసం ఒప్పందం కుదిరినా, శాశ్వత ఒప్పందంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒప్పందా న్ని ఇరాన్, పాలస్తీనా సహా అన్ని దేశాలూ స్వాగతించాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తామూ సిద్ధంగా ఉన్నట్టు హమాస్ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న మొదలైన సంక్షోభం క్రమంగా కొలిక్కి వస్తున్నది.