రామ్-బోయపాటి కాంబినేషన్‌లో స్కంద మూవీ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల కీలక కథానాయిక. ఈ మధ్య రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ మామూలు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచలేదు. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి పూర్తవుతూ వస్తున్నాయి. ఇక మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్‌ల క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. కాగా, సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రీ రిలీజ్ థండర్‌కు చీఫ్ గెస్ట్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ వస్తున్నాడు అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పకలా వేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో మరెన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నట్టు ఈ మూవీని నిర్మిస్తున్న శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రకటించింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్కంద ఒకేసారి విడుదలకు సిద్ధమవుతోంది.
