ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యాపై అమెరికా మిత్ర దేశాల వైఖరి అంతా ఒక్కటిగానే ఉందని, కానీ ఒక్క ఇండియా మాత్రమే భిన్నమైన విధానాన్ని అవలంభిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వాషింగ్టన్లో వ్యాపారవేత్తలను ఉద్దేశించి బైడెన్ మాట్లాడుతూ నాటో, యూరోపియన్ యూనియన్, ఆసియా దేశాలు అన్నీ పుతిన్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. కానీ ఒక్క భారత్ వైఖరి మాత్రమే మినహాయింపుగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్‌లోని ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు రష్యా తీరును ఖండిస్తున్నాయని అన్నారు. కానీ రష్యా నుంచి డిస్కౌంట్లో ఆయిల్ కొనేందుకు సిద్ధమైన ఇండియా విధానం భిన్నంగా ఉన్నట్లు బైడెన్ ఆరోపించారు. యూఎన్లోనూ రష్యాకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేయలేదు. నాటోతో పాటు పసిఫిక్ దేశాలన్నీ ఐక్యంగా ఉన్నట్లు తెలిపారు. క్వాడ్ గ్రూప్‌లో ఇండియా ఒక్కటే మినహాయింపు అని, జపాన్, ఆస్ట్రేలియా చాలా తీవ్రంగా రష్యాకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)