Namaste NRI

అల్లరి నరేష్ బచ్చలమల్లి ఫస్ట్ లుక్ విడుదల

అల్లరి నరేశ్‌ హీరోగా నటిస్తూ చిత్రం బచ్చల మల్లి. అమృత అయ్యర్‌ కథానాయిక.  1990 కాలంనాటి భావోద్వేగ ప్రయాణంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉద్వేగవంతమైన పాత్రలో అల్లరినరేశ్‌ కనిపించనున్నారు. సుబ్బు మంగదేవి దర్శకుడు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  

ఈ పోస్టర్‌లో మునుపెన్నడూ చూడని మాస్‌ అవతారంలో, సీరియస్‌ లుక్‌తో అల్లరి నరేశ్‌ కనిపించారు. రిక్షామీద కూర్చుని సిగరెట్‌ తాగుతూ, మ్యాసీ హెయిర్‌, గడ్డంతో మాస్‌ ప్రేక్షకులకు మెచ్చేలా అల్లరి నరేశ్‌ లుక్‌ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్‌, అచ్యుత్‌కుమార్‌, బలగం జయరామ్‌, హరితేజ, వైవా హర్ష, ప్రవీణ్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథనం: విప్పర్తి మధు, కెమెరా: రిచర్డ్‌ ఎం.నాథన్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress