విశాఖలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పుష్ప-2 సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ వైజాగ్ వెళ్లారు. ఇండోగో ప్లైట్ హైదరాబాద్ నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. విశాఖ పోలీసులు భారీ బందోబస్తుతో ఐకాన్ స్టార్ ను విమానాశ్రయం నుండి నగరంలోని నోవాటెల్ హోటల్ కు తరలించారు. హోటల్ వద్ద కూడా అల్లు అభిమానులు సందడిచేసారు. రేపటి నుంచి 10 రోజులపాటు పుష్స-2 షూటింగ్ వైజాగ్ లో జరుగనుంది. షూటింగ్ కోసం మారేడుపల్లి, అరుకు లోయ అటవీ ప్రాంతాల్లో సెట్లు ఏర్పాట్లు పూర్తయినట్లు చిత్రయూనిట్ తెలిపింది.